Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లోకేశ్‌పై జగన్‌ అండ్ కో ఫేక్ ప్రచారాలు చేస్తోంది.. రామ్మోహన్ ధ్వజం

లోకేశ్‌పై జగన్‌ అండ్ కో ఫేక్ ప్రచారాలు చేస్తోంది.. రామ్మోహన్ ధ్వజం

శ్రీకాకుళం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy).. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ అండ్ కోకి లోకేశ్ అంటే భయమని, అందుకే ఆయనను టార్గెట్‌గా చేసుకుని ఫేక్ ప్రచారాలు చేస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. ఈరోజు (మంగళవారం) శ్రీకాకుళం జిల్లాల్లో రామ్మోహన్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

వైసీపీ తాను తీసిన గోతిలో తానే పడింది..

డీఎస్సీ విషయంలో వైసీపీ విషప్రచారాన్ని కూటమి ప్రభుత్వం తిప్పి కొట్టిందని రామ్మోహన్ తెలిపారు. వైసీపీ తాను తీసిన గోతిలో తానే పడిందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. గ్రామాల్లో పెద్దఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో ఏపీ అభివృద్ధిలో ముందుకు సాగుతోందని ఉద్ఘాటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన దురదృష్టకరమని చెప్పారు. బాధిత కుటుంబాలకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆదుకుంటుందని రామ్మోహన్ నాయుడు భరోసా కల్పించారు.

.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సమావేశం.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy