అమరావతి, జూన్8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రేపు(మంగళవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) అధ్యక్షతన జూన్ 10వ తేదీన నిర్వహించనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో వీరు పాల్గొననున్నారు.
మోదీ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరుకానుండగా, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రాలతో సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
అదేవిధంగా, త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పాత్ర, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు, రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై కూడా చర్చలు జరగవచ్చని సమాచారం. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక అంశాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర సహాయ నిధులు, పెండింగ్‌లో ఉన్న విభజన హామీలపై సీఎం చంద్రబాబు కేంద్ర నాయకత్వంతో చర్చించే అవకాశం ఉంది.
.
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు
16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల
Read AP News Latest And Telangana News And National News
And Telugu News

