Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాకు భారత్ లాంటి మిత్రదేశాలున్నాయి.. జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్

మాకు భారత్ లాంటి మిత్రదేశాలున్నాయి.. జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్

జ్రాయెల్‌కు ఉన్న ఏకైక మిత్రదేశం అమెరికా మాత్రమేనని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలకు బెంజమిన్ నెతన్యాహు కౌంటర్ ఇచ్చారు. అమెరికా అత్యంత కీలక మిత్రదేశమే అయినప్పటికీ, భారత్ వంటి నమ్మకమైన సన్నిహిత దేశాలు కూడా తమకు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ మాట్లాడుతూ, 'ఇజ్రాయెల్‌కు నిజమైన శక్తిమంతమైన మిత్రదేశం అమెరికానే' అని పేర్కొన్నారు (India Israel relations).

జేడీ వాన్స్ వ్యాఖ్యలపై తాజాగా నెతన్యాహు స్పందించారు. 'అమెరికా మద్దతు నిజంగా మాకు అమూల్యమైనదే. ఇజ్రాయెల్‌కు ఇతర దేశాల నుంచి కూడా బలమైన మద్దతు ఉంది. మాకు భారత్ లాంటి మరికొన్ని మంచి మిత్రదేశాలు ఉన్నాయి. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో మాకు ఎంతో ఆదరణ, మద్దతు లభిస్తోంది. ప్రపంచంలోని పలువురు దేశాధినేతలు బహిరంగంగా కాకపోయినా, వ్యక్తిగతంగా ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్నారు' అని నెతన్యాహు వెల్లడించారు (Netanyahu counter to JD Vance).

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను, వైట్ హౌస్‌లో ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడిగా నెతన్యాహు అభివర్ణించారు (US Israel relations). జేడీ వాన్స్‌పై తనకు గౌరవం ఉందని, అయితే ఆయన చెప్పిన ప్రతి విషయంతోనూ తాను ఏకీభవించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.


జోరుగా పెట్టుబడుల ఉపసంహరణ

సింగపూర్‌-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్‌ కేబుల్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy