Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

ప్పటికే తీవ్ర అంతర్గత విభేదాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఎంసీ సీనియర్ నేత, ఎంపీ కల్యాణ్ బెనర్జీ పార్టీ అధినేత మమతా బెనర్జీకి నేరుగా అల్టిమేటం జారీ చేశారు.

మమత మేనల్లుడు, టీఎంసీ కీలక నేత అభిషేక్‌పై తాజాగా తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు (TMC crisis Mamata Banerjee).

'నేను మమత దీదీ వెంటే ఉన్నాను. కానీ, ఆమె ఎవరి పక్షంలో ఉన్నారో తేల్చుకోవాలి. మమత మాతో ఉంటారా.. లేక అభిషేక్‌తో ఉంటారా' అని కల్యాణ్ ప్రశ్నించారు. సంతకాల ఫోర్జరీ కేసులో చివరి నిమిషంలో తనను న్యాయవాదిగా తొలగించి అభిషేక్ అవమానించారని కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అభిషేక్‌కు సీనియర్ లీడర్లను గౌరవించడం రాదని, అహంకారంతో తనను తాను కింగ్‌లా భావించుకోవడం వల్లే పార్టీ ధ్వంసమవుతోందని కల్యాణ్ పేర్కొన్నారు (Kalyan Banerjee about Abhishek Banerjee).

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో టీఎంసీకి కష్టాలు మొదలయ్యాయి (TMC internal conflict). పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడి వెళ్లిపోయారు. ముఖ్యంగా మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై చాలా కాలంగా ఉన్న అసంతృప్తిని పార్టీ నేతలు బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. తాజాగా, టీఎంసీ రాజ్యసభ ఎంపీ ప్రకాశ్ బైరక్ కూడా రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో రాజ్యసభకు రాజీనామా చేసిన మూడో టీఎంసీ ఎంపీగా ప్రకాశ్ బైరక్ నిలిచారు. దీంతో ఎగువ సభలో తృణమూల్ ఎంపీల బలం పదికి తగ్గింది.


వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1గా టీమిండియా..

సీబీఎస్ఈ లోపాలు ఎత్తిచూపిన యువకుడికి ఐఐటీ కాన్పుర్‌లో జాక్‌పాట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy