Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మద్యం మత్తులో మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు.. యువతి పరిస్థితి విషమం

మద్యం మత్తులో మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు.. యువతి పరిస్థితి విషమం

రాజమండ్రి, ఆగస్టు 06: స్థానిక అప్పారావు రోడ్డులో దారుణం చోటు చేసుకుంది. జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థిని యువకులు కారుతో ఢీ కొట్టారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆ యువతి తీవ్రంగా గాయపడింది.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మెడికోను స్థానిక ఆసుపత్రికి తరలించారు. యువతికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆమెకు మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు కుటుంబ సభ్యులు తరలించారు. ఈ ఘటన ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో వారు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరు నామవరానికి చెందిన వారని తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి ముందు ఈ యువకులు ప్రసాద్ ఆదిత్యమాల్ సిబ్బందితో కూడా ఘర్షణకు దిగినట్లు పోలీసులు కనుగొన్నారు. ప్రసాద్ ఆదిత్య మాల్‌లో సినిమా చూసి బయటకు వచ్చిన మెడికోను వీరు కారుతో ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీశైలానికి పోటెత్తిన వరద

గౌరవప్రద జీవనం కోసమే..

For More AP News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy