Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మమతకు షాక్.. టీఎంసీకి మరో ఎంపీ రాజీనామా..

మమతకు షాక్.. టీఎంసీకి మరో ఎంపీ రాజీనామా..

శ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ తాజాగా రాజీనామా చేశారు.

ఈ వారంలో టీఎంసీకి రాజీనామా చేసిన రాజ్యసభ రెండో ఎంపీగా సుష్మిత నిలిచారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీఎంసీకి ఇది మరో పెద్ద ఎదురుదెబ్బ (TMC Sushmita Dev resigns).

సుష్మితా దేవ్ 2021లో కాంగ్రెస్‌ను వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు (TMC crisis Mamata Banerjee). అనంతరం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇటీవలి కాలం వరకు మమతకు ఆత్మీయురాలిగా మెలిగారు. హఠాత్తుగా పార్టీకి రాజీనామా చేశారు. టీఎంసీకి చెందిన కొందరు తిరుగుబాటు ఎంపీలు ప్రత్యేక పార్లమెంటరీ బ్లాక్ ఏర్పాటు చేసి ఎన్డీయేకు మద్దతు ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య సుష్మితా దేవ్ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవలి కాలంలో పార్టీకి చెందిన పలువురు నేతలు మమతా బెనర్జీ నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేశారు (TMC rebellion). అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలవడంతో చాలా మంది నేతలు పార్టీని వీడుతున్నారు. సోమవారం నాడు, సీనియర్ తృణమూల్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా ప్రకటించారు.


అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారుల మృతి..

బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy