Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెటా ఉద్యోగి గుస్సా! వేల మంది హాజరైన మీటింగ్‌లో..

మెటా ఉద్యోగి గుస్సా! వేల మంది హాజరైన మీటింగ్‌లో..

ఇంటర్నెట్ డెస్క్: మెటాలో ఒక ఉద్యోగి రెచ్చిపోయి పైఅధికారిని ఇష్టారీతిన తిట్టిపోసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వేల మంది హాజరైన ఆన్‌లైన్ మీటింగ్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

ఆ ఉద్యోగి ఏఐ విభాగంలోని వ్యక్తి అని సమాచారం.

మీడియా కథనాల ప్రకారం, కంపెనీలో ఆన్‌లైన్ వేదికగా ఒక అంతర్గత ప్రజెంటేషన్ జరుగుతున్న తరుణంలో ఈ ఘర్షణ తలెత్తినట్టు తెలిసింది. కంపెనీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని సదరు ఉద్యోగి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పైఅధికారి చెత్త అంటూ మండిపడ్డారు. లైవ్‌స్ట్రీమింగ్ సమయంలో ఇలా జరగడంతో మీటింగ్‌లో పాల్గొన్న వేల మంది నిర్ఘాంతపోయారు. మీటింగ్ ఏర్పాటు చేసిన కొందరు పైఅధికారులు ఏం చేయాలో పాలుపోక ముఖాలకు చేతుల్ని అడ్డుపెట్టుకున్నారని సమాచారం. మెటాకు చెందిన అప్లైడ్ ఏఐ డివిజన్‌లోని ఈ ఉద్యోగి అందరిముందూ తన పైఅధికారిపై రెచ్చిపోయినట్టు తెలుస్తోంది.

ఏఐపై పట్టుసాధించేందుకు మెటా ఈ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అయితే, విభాగంలో కార్యకలాపాల తీరు తమకు తీవ్ర అసంతృప్తి కల్పిస్తోందని కొందరు ఉద్యోగులు మీడియాతో చెప్పారు. జైల్లో ఉన్నట్టు ఉందని కొందరు అభివర్ణించారు. వారం వారం ఏవో పనులు అప్పగిస్తుంటారని, అవి చేయడం మినహా ఉద్యోగులకు మరే అవకాశం ఉండదని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

40 మీటర్ల ఎత్తునుంచి తోసేశారు.. యువతి ప్రాణం పోయింది..

జడ్జి సీటులో కూర్చున్న మహిళ! ఆర్డర్.. ఆర్డర్.. అంటూ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy