అమరావతి, జూన్ 26: మొహర్రం పర్వదినం నేడు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
'ఎన్ని కష్టాలు ఎదురైనా సత్య మార్గంలో నడవాలనే స్ఫూర్తిని మనకు మొహర్రం అందిస్తుంది. మొహర్రం అంటేనే త్యాగం. సత్యం, న్యాయం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని మొహర్రం సందర్భంగా స్మరించుకుందాం. మొహర్రం అందరికీ శాంతిని తీసుకురావాలని, ధర్మ మార్గాన్ని చూపాలని కోరుకుంటున్నాను' అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
శాంతి, సామరస్యాల ప్రతీకగా మొహర్రం: లోకేశ్
హజ్రత్ హుస్సేన్ మహనీయుని అమరత్వం, త్యాగాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు స్మరించుకునే సందర్భం మొహర్రం అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. త్యాగం, సహనంతో ధర్మ పరిరక్షణ కోసం పాటుపడటమే మొహర్రం మనకు ఇచ్చే సందేశమని చెప్పారు. అల్లాహ్ దీవెనలతో శాంతి, సామరస్యాల ప్రతీకగా మొహర్రం జరగాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
లారీలో చెలరేగిన మంటలు.. డ్రైవర్ సజీవదహనం
వైసీపీ రాక్షస పాలనలో కష్టాల కడలిలో ప్రజలు
For More AP News And Telugu News

