Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నా  వల్లే మెక్‌కల్లమ్ కోచ్ పదవి పోయింది.. స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు

నా వల్లే మెక్‌కల్లమ్ కోచ్ పదవి పోయింది.. స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు

స్పోర్ట్స్ డెస్క్: ఇటీవల అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు అనూహ్య రీతిలో రిటైర్‌మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్.. తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించాడు.

ఆటగాడిగా వీడ్కోలు పలికినప్పటికీ ఆటలోనే కొనసాగుతానని, భవిష్యత్తులో ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌ అవుతానని తెలిపాడు. అంతేకాక తన కారణంగానే న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కోచ్ పదవి పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు స్టువర్ట్ బ్రాడ్, జోస్ బట్లర్ నిర్వహించిన 'ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్' పాడ్‌కాస్ట్‌లో స్టోక్స్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పాడ్‌కాస్ట్‏లో స్టోక్స్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతూనే 'లెవెల్-3' కోచింగ్ కోర్సు పూర్తి చేస్తున్నాను. భవిష్యత్తులో ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని ఉంది. నా జట్టుకు కోచ్‌గా ఉండటం అంటే ఇష్టం. నాయకత్వ లక్షణాలు, శిక్షణ పట్ల నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది' అని పేర్కొన్నాడు. అంతేకాకుండా 2027లో జరగబోయే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ద్వారా స్టోక్స్ రీఎంట్రీ ఇస్తారన్న ప్రచారాన్ని అతడు పూర్తిగా ఖండించాడు. కెప్టెన్‌గా కాకుండా కేవలం ఆటగాడిగా మాత్రమే ఆడే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు.

ఇక నాటి కోచ్ మెక్‌కల్లమ్‌తో కలిసి నాలుగేళ్ల పాటు 'బజ్‌బాల్' (Bazball) వ్యూహంతో ఇంగ్లండ్ క్రికెట్‌ను నడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. 'నేను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోకపోతే మెక్‌కల్లమ్ ఇంకా టెస్టు కోచ్‌గానే ఉండేవాడు. నా నిర్ణయం వల్లే ఆయనపై ప్రభావం పడింది. నా కారణంగానే ఆయన పదవి పోయింది' అని స్టోక్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ప్రస్తుతం మెక్‌కల్లమ్ స్థానంలో న్యూజిలాండ్ మాజీ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇంగ్లండ్ కొత్త టెస్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.

న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన తర్వాత స్టోక్స్ వీడ్కోలు పలకడంతో ఇంగ్లండ్ టెస్టు సారథిగా జో రూట్‌ను ఇంగ్లండ్ క్రికెట్ నియమించింది. అయితే, తన తర్వాత హ్యారీ బ్రూక్‌ను కెప్టెన్ చేస్తారని భావించినట్లు స్టోక్స్ పేర్కొన్నాడు. రూట్‌కు బాధ్యతలు ఇవ్వడం తనను కొంత ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపాడు. అయితే రూట్ విజయవంతమైన కెప్టెన్‌గా నిలుస్తాడని బెన్ స్టోక్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

strong>

పీసీబీ కీలక నిర్ణయం..పాక్ బ్యాటింగ్ కోచ్‌గా స్మిత్

యూఏఈ వేదికగా మహిళల టీ20 ఆసియా కప్ 2026..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy