Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూఏఈ వేదికగా మహిళల టీ20 ఆసియా కప్ 2026..!

యూఏఈ వేదికగా మహిళల టీ20 ఆసియా కప్ 2026..!

స్పోర్ట్స్ డెస్క్: ఇటీవల జరిగిన ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్2026 క్రికెట్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మహిళల క్రికెట్ లో మరో ఆసక్తికర సమరం త్వరలో జరగనుంది.

మహిళల టీ20 ఆసియా కప్‌ 2026 టోర్నీకి సంబంధించిన తేదీలను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) సభ్య దేశాలకు అంతర్గతంగా తెలియజేసినట్లు క్రీడా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ టోర్నీ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు జరిగే అవకాశం ఉందని సమాచారం.

క్రీడా వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఐసీసీ టోర్నీకి యూఏఈ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే మ్యాచులు, వేదికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ వివరాలను ఏసీసీ అధికారికంగా ప్రకటించలేదు. ఆసియా ఖండానికి సంబంధించిన ఈ ఐసీసీ టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మలేసియా, థాయ్‌లాండ్‌, యూఏఈ జట్లు పోటీపడతాయని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మరోసారి భారత్‌-పాకిస్థాన్‌ మహిళల మ్యాచ్‌ చూసే అవకాశం లభించనుందని క్రికెట్‌ అభిమానులను భావిస్తున్నారు. అయితే ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడతాయనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఏసీసీ పూర్తి షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఇండియా, పాక్ మ్యాచ్‌పై స్పష్టత వస్తుంది.

సభ్య దేశాలకు ఏసీసీ పంపిన సమాచార ప్రకారం.. అన్నీ జట్లు ఆగస్టు 27న యూఏఈకి చేరుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 13న ఫైనల్‌ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. టోర్నీ వేదికకు సంబంధించిన తుది నిర్ణయం, పరిపాలనా అనుమతులు పూర్తికాకపోవడంతోనే ఏసీసీ షెడ్యూల్ విడుదల ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. ఆసియా కప్‌లో భారత్‌దే ఆధిపత్యం నడుస్తోంది. ఇప్పటివరకు టీమిండియా ఏడు టైటిళ్లు గెలిచింది. అయితే 2024లో జరిగిన చివరి ఎడిషన్‌లో శ్రీలంక ఫైనల్లో భారత్‌ ఓడింది.

strong>

విషాదం.. గుండెపోటుతో బ్రెజిల్ ప్లేయర్ మృతి

లుసానె డైమండ్ లీగ్: బరిలోకి దిగనున్న నీరజ్ చోప్రా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy