Dailyhunt
నారీ శక్తికి కాంగ్రెస్ ద్రోహం చేసింది.. మహేశ్వర్ రెడ్డి  ధ్వజం

నారీ శక్తికి కాంగ్రెస్ ద్రోహం చేసింది.. మహేశ్వర్ రెడ్డి ధ్వజం

హైదరాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో మహిళా బిల్లు వీగిపోవడం చీకటి రోజని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Aleti Maheshwar Reddy) వ్యాఖ్యానించారు.

మహిళా బిల్లు వీగిపోయిందని కాంగ్రెస్ వీర్రవీగుతోందని ధ్వజమెత్తారు. వీర్రవీగే కాంగ్రెస్‌కు వచ్చే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈరోజు(శనివారం) హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. సౌత్ ఇండియాను కాంగ్రెస్ మిత్రపక్షాలు మర్చిపోతున్నాయని అన్నారు.

మహిళల ఆశయాలను కాంగ్రెస్‌ నీరుగార్చింది..

దేశంలోని ప్రతి మహిళ ఇండియా కూటమి వ్యవహారాన్ని గుర్తు పెట్టుకుంటారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. నారి శక్తికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని ఆగ్రహించారు. కాంగ్రెస్‌ మహిళల ఆశయాలను నీరుగార్చిందని దుయ్యబట్టారు. మహిళను ఆరాధించే సంస్కృతి భారతదేశానిదని చెప్పుకొచ్చారు. ఏడుసార్లు మహిళా బిల్లును ఓడించిన ఘనత కాంగ్రెస్‌దని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్‌ను ప్రజలు మర్చిపోతున్నారని అన్నారు. మహిళ బిల్లు విషయంలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు.

రేవంత్‌రెడ్డి రాజ్యాంగాన్ని పూర్తిగా చదవలేదు..

సీఎం రేవంత్‌రెడ్డి రాజ్యాంగాన్ని పూర్తిగా చదవలేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్‌లో చేసిన చట్టాలను రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. రేవంత్‌రెడ్డి రాజ్యాంగంలోని అంశాలను పూర్తిగా తెలుసుకోని మాట్లాడాలని హితవు పలికారు. మహిళ బిల్లు పాస్ అయితే సౌత్ ఇండియాకు మేలు జరిగేదని ప్రస్తావించారు. మహిళ బిల్లు విషయంలో క్షేత్ర స్థాయిలోకి వెళ్తామని.. ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను ప్రజల ముందు దోషిగా నిలబెడతామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

.

రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ శివధర్ రెడ్డి

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం చారిత్రాత్మకం: రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుపై మా ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదు: మంత్రి ఉత్తమ్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy