Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నంబర్ల కోసం ఆడితే ఎక్కువకాలం కొనసాగలేం.. బ్యాటింగ్ సీక్రెట్ చెప్పేసిన కోహ్లీ

నంబర్ల కోసం ఆడితే ఎక్కువకాలం కొనసాగలేం.. బ్యాటింగ్ సీక్రెట్ చెప్పేసిన కోహ్లీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్‌ సక్సెస్‌ వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానికే తాను ఎప్పుడూ ప్రాధాన్యమిచ్చానని చెప్పాడు.

వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడితే సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగడం సాధ్యం కాదని స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో అజేయ సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. తన మాటలకు తగ్గట్టుగానే మరోసారి జట్టు విజయానికి కీలకంగా నిలిచాడు.

'జట్టును గెలిపించాలనే ఉద్దేశంతో ఆడితేనే ఇంతకాలం కొనసాగగలం. కేవలం నంబర్ల కోసం ఇంత సుదీర్ఘంగా ఆడలేం. వ్యక్తిగత రికార్డుల కోసం ప్రయత్నిస్తే ప్రధాన లక్ష్యమైన జట్టు విజయాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. అలా చేస్తే ఎక్కువ కాలం కొనసాగడం సాధ్యం కాదు. ఇన్నేళ్లుగా ఈ స్థాయిలో ఉండగలిగినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నా. మరో విజయంలో భాగంగా ఇలాంటి పెద్ద మైలురాయిని అందుకోవడం ఎంతో ప్రత్యేకం' అని కోహ్లీ వెల్లడించాడు.

గిల్‌తో మంచి అనుబంధం..

'గిల్‌తో మొదటి నుంచీ సరదాగా, స్వేచ్ఛగా మాట్లాడుతుంటాను. ఇప్పుడు అతడు నాయకుడి స్థానంలో ఉన్నాడు. నేను కూడా చాలాకాలం ఆ బాధ్యతలు నిర్వర్తించాను. ఇప్పుడు జట్టులో ఒక సీనియర్ ప్లేయర్‌గా ఉన్నాను. సీనియర్ ఆటగాళ్లు, కెప్టెన్ నవ్వుతూ, సరదాగా ఉంటే మిగతా ఆటగాళ్లలోనూ ఒత్తిడి తగ్గుతుంది. ఎంతటి క్రిటికల్ మ్యాచ్ అయినా అందరూ ప్రశాంతంగా ఆడగలుగుతారు. మైదానంలో మాత్రం పూర్తి ప్రొఫెషనల్‌గా ఉంటాం.

'గిల్‌తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మ్యాచ్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడానికి ఇష్టపడం. ఇతర విషయాలే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అతడికి ఏం చేయాలో తెలుసు.. నాకు ఏం చేయాలో తెలుసు. అతను కొన్ని షాట్లు ఆడే ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుభవం ఆధారంగా అవసరమైతే కొన్ని సూచనలు ఇస్తాను. అయితే మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఎక్కువగా చర్చించుకుంటాం. కెప్టెన్‌గా గిల్‌పై చాలా బాధ్యతలు ఉంటాయి. అతడితో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడికి ఆటపై మంచి అవగాహన ఉంది. జట్టును ఎలా గెలిపించాలనే దానిపై సరైన దృక్పథం ఉంది. అందుకే అతడు జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు' అని కోహ్లీ వెల్లడించాడు.

strong>

ఆసియా గేమ్స్: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు భారత్

కోహ్లీని అలా వదిలేయాలి.. మ్యాచ్‌లు సులువుగా గెలిపించేస్తాడు: గిల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy