Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నటి ట్విష శర్మ కేసు.. రెండు వారాల తర్వాత అంత్యక్రియలు పూర్తి..

నటి ట్విష శర్మ కేసు.. రెండు వారాల తర్వాత అంత్యక్రియలు పూర్తి..

భోపాల్, మే 25: నటి ట్విష శర్మ కేసుకు సంబంధించి ఆదివారం రెండో పోస్టుమార్టం పూర్తయింది. పోలీసులు ట్విష మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. దాదాపు రెండు వారాల తర్వాత ట్విష అంత్యక్రియలు జరిగాయి.

ట్విష అంత్యక్రియలు ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం ఆమె కుటుంబసభ్యులే. మొదటి పోస్టుమార్టంలో అవకతవకలు జరిగాయని, రెండో పోస్టుమార్టం చేస్తే గానీ బాడీ తీసుకోమని ట్విష కుటుంబసభ్యులు తేల్చి చెప్పారు. అధికారులు బాడీని అప్పగించడానికి ప్రయత్నించినా వారు తీసుకోలేదు.

తాజాగా, మధ్యప్రదేశ్ హైకోర్టు ట్విష కుటుంబసభ్యుల డిమాండ్‌పై సానుకూలంగా స్పందించింది. పోస్టుమార్టం ఢిల్లీ ఏఐఐఎమ్ఎస్ టీమ్ మాత్రమే చేయాలని, అది కూడా భోపాల్‌లోనే పోస్టుమార్టం చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం రాత్రి నలుగురు ఢిల్లీ ఏఐఐఎమ్ఎస్ డాక్టర్లు భోపాల్ చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.40 గంటలకు భోపాల్ ఏఐఐఎమ్ఎస్‌లో రెండో పోస్టుమార్టం జరిగింది. బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబసభ్యులు సాయంత్రం భద్భద విశ్రమ్ ఘాట్‌లో ట్విష అంత్యక్రియలు నిర్వహించారు.

కేసు వివరాలు..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ట్విష శర్మకు 2024లో డేటింగ్ యాప్ ద్వారా భోపాల్‌కు చెందిన సమర్థ్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 2025 డిసెంబర్ నెలలో ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మే 12వ తేదీన కటారా హిల్స్‌లోని సమర్థ్ ఇంట్లో ట్విష ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ట్విష మరణించినప్పటినుంచి సమర్థ్ పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కోసం మధ్య ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు అతడి బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. భోపాల్‌లోని కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం సమర్థ్ జబల్‌పూర్‌ కోర్టులో లొంగిపోయాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy