తిరుమల, మే 25 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామిని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) ఈరోజు (సోమవారం) దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులు తాగునీరు, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగినా టీటీడీ చేపడుతున్న ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కేంద్రమంత్రి ప్రశంసించారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు సమర్థవంతంగా సేవలు అందజేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వసతులు సమృద్ధిగా ఉండటంతో భక్తులు ఆనందంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం, టీటీడీ కలిసి కృషి చేస్తున్నాయని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
.
రక్తచరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసు.. జగన్ అండ్ కోపై మంత్రి నారాయణ ధ్వజం
కూటమి ప్రభుత్వంలో పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నాం: మంత్రి అనగాని
Read Latest AP News And Telangana News And International News And Telugu News

