Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు శ్రీకాళహస్తి, అనంతపురానికి చంద్రబాబు

నేడు శ్రీకాళహస్తి, అనంతపురానికి చంద్రబాబు

తిరుపతి/అనంతపురం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఆదివారం శ్రీకాళహస్తి, అనంతపురంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11.30కు శ్రీకాళహస్తి ఎంజీఎం ఆస్పత్రి వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

సీసీఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు వెళ్లి.. దివంగత శాప్‌ మాజీ చైర్మన్‌ పీఆర్‌ మోహన్‌ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం 12.05కి అనంతపురం బయల్దేరతారు. 1.15కి నగర శివారులో ని శిల్పారామం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. బళ్లారి బైపాస్‌ రోడ్డులోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాల్‌కు వెళ్తారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూ రు జయరాం కుమార్తె, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. వధూవరులను ఆశీర్వదించి.. మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి 3.40 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్‌

గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy