Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్‌

సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్‌

విశాఖపట్నం: సింహాద్రి అప్పన్న దేవస్థానంలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. మరో ఉద్యోగికి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. దేవస్థానంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఎన్.

నయనారుపై భక్తుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రూ.300 క్యూలైన్‌ టికెట్ల కోసం భక్తుల నుంచి డబ్బులు తీసుకుని, వారికి టికెట్లు ఇవ్వలేదని తెలుస్తోంది.

ఈ క్రమంలో నీలాద్రి గుమ్మం వద్ద టికెట్‌ లేకుండా వచ్చిన కొంతమంది భక్తులను ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అడ్డుకుని ప్రశ్నించారు. తాము డబ్బులు చెల్లించినా టికెట్‌ ఇవ్వలేదని భక్తులు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు సంబంధిత కౌంటర్‌ను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో నయనారు వద్ద లెక్కలో లేని అదనపు రూ.4,700 నగదు ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. విధుల్లో మద్యం సేవించినట్లు ఆరోపణలు రావడంతో బి. సన్యాసిరావుపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే శానిటేషన్‌ విభాగంలో పనిచేస్తున్న కె. అప్పలరాజు విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించి ఆయనను కూడా సస్పెండ్‌ చేశారు. మరోవైపు కప్పస్తంభం వద్ద విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి అరుణ్‌కుమార్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు.

సినిమా సీన్‌ను తలదన్నే చోరీ.. 30 సెకన్లలో 105 కిలోల చికెన్‌ను.

వయసు పెరిగే కొద్దీ కండరాలు బలహీనపడుతున్నాయా? ఇది తెలుసుకోండి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy