Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే ప్రపంచ కప్ 2027పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్..

ప్రపంచ కప్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేకు ముందు రోహిత్ తన క్రికెట్‌పై మాట్లాడాడు. వన్డే క్రికెట్‌లో తాను చేయాల్సిన పని ఇంకా మిగిలే ఉందని స్పష్టం చేశాడు. ఆడుతున్నంత కాలం తన ముందు ఏదో ఒక లక్ష్యం ఉంటుందని తెలిపాడు.

'నేను చేయాల్సిన పని పూర్తి అయిందనే ఆలోచన ఎప్పుడూ నా మనసులోకి రాదు. క్రికెట్ ఆడుతున్నంత కాలం నేను సాధించేందుకు ఏదో ఒకటి ఉంటుంది. ప్రస్తుతం నేను ప్రపంచ కప్ కోసం ఎదురుచూస్తున్నా. ప్రపంచ కప్‌ అయినా.. ఏదైనా ఐసీసీ టోర్నీ అయినా దానికి ప్రత్యేకమైన సవాలు ఉంటుంది. వేర్వేరు ప్రత్యర్థులతో, వివిధ మైదానాల్లో ఆడాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా మనం సిద్ధం కావాలి. భిన్నంగా ఆలోచించాలి. అదే ఈ టోర్నీల్లోని అసలైన సవాలు' అని రోహిత్‌ వివరించాడు.

రోహిత్‌ శర్మ ఇప్పటికే రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ సాధించిన జట్టులో ఉండగా.. 2024లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే వన్డే ప్రపంచకప్‌ను మాత్రం ఇప్పటివరకు అందుకోలేకపోయాడు. 2023లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ నేతృత్వంలోని భారత్‌ ఫైనల్‌కు చేరింది. అయితే అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తుది పోరులో ఓటమి ఎదురైంది. దీంతో ప్రపంచకప్‌ గెలవాలన్న రోహిత్‌ కల నెరవేరలేదు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా 2027 వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. అక్టోబర్‌ 4 నుంచి నవంబర్‌ 21 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. దీంతో మరోసారి ప్రపంచకప్‌ ట్రోఫీని అందుకునే అవకాశం రోహిత్‌కు లభించనుంది.

strong>

ఆసియా క్రీడలు: డబుల్ బొనాంజా.. కబడ్డీలో భారత్‌కు మరో స్వర్ణం

ఇదే నా చివరి ప్రపంచ కప్.. రిటైర్‌మెంట్ కన్ఫామ్ చేసిన కోహ్లీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy