Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేపాల్ వరదలు.. సోషల్ మీడియాలో ఆ వీడియోల తొలగింపు!

నేపాల్ వరదలు.. సోషల్ మీడియాలో ఆ వీడియోల తొలగింపు!

ఇంటర్నెట్ డెస్క్: టిబెట్ ప్రాంతంలో మొదలైన ఆకస్మిక వరదలు నేపాల్‌కు భారీ నష్టాన్ని మిగిల్చియాయి. ఇందుకు సంబంధించి టిబెట్ వాసులు నెట్టింట పోస్టు చేసిన పలు వీడియోలు ఆ తరువాత కనిపించకుండా పోయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

చైనా ప్రభుత్వం జోక్యంతోనే ఈ వీడియోలు తెరమరుగైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నేపాల్ వరదలకు సంబంధించి అనేక మంది జర్నలిస్టులు ప్రత్యక్ష సాక్షుల కథనాలను తెలుసుకుని రికార్డు చేస్తున్నారు. నేపాల్ ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు పంచుకుంటోంది. అయితే, టిబెట్‌లో వెలువడే వార్తలపై చైనా పటిష్ఠ నిఘా పెడుతున్నట్టు సమాచారం. చైనా ప్రభుత్వ మీడియా ద్వారానే సమాచారం ప్రపంచానికి తెలుస్తోంది. సహాయక చర్యలకు సంబంధించిన సమాచారమే ఇప్పటివరకూ వెలువడిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, టిబెట్ గ్విరాంగ్ బార్డర్ క్రాసింగ్ వద్ద వరద ముంచెత్తిన వీడియోలు తొలుత సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిపై చైనా సోషల్ మీడియాలో సెన్సార్ షిప్ అమలు కావడంతో అనేక వీడియోలు కనిపించకుండాపోయాయి. ఈ పరిణామాలపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రుల ఆచూకీ తెలుసుకునేందుకు ఉపయోగపడే ఈ వీడియోలను సెన్సార్ చేయడం తగదని చెబుతున్నారు.

వరదల సమయంలో నేపాల్‌ సరిహద్దుకు ఆవల చిక్కుకుపోయిన 320 మంది భారతీయు ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. మిగిలిన అక్కడి నుంచి స్వదేశానికి రప్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. నేపాల్‌కు కూడా అన్ని రకాల సహయసహకారాలు అందిస్తున్నామని చెప్పింది.

ఈ వార్తలనూ చదవండి:

నేపాల్ వరదలు.. 734కు చేరిన మృతుల సంఖ్య.. 2,500 మంది గల్లంతు

రష్యా భీకర దాడి.. దద్దరిల్లిన ఉక్రెయిన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy