Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీ డ్రామాలు ఇక చెల్లవు.. జగన్‌పై నారా లోకేశ్ ధ్వజం

నీ డ్రామాలు ఇక చెల్లవు.. జగన్‌పై నారా లోకేశ్ ధ్వజం

మరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy).. లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పోస్టుపెట్టారు. '#PsychoFekuJagan' '#YcpCriminalPolitics' హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టు చేశారు. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం వరుస నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలు ఇటువంటి రాజకీయ డ్రామాలను తిరస్కరించినప్పటికీ వాటిని కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావించారు.

'బాబాయి గుండెపోటు, కోడి కత్తి, గులకరాయి నాటకాల రాయుడు జగన్' అంటూ విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు వైసీపీ కార్యకర్తలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య అనే వ్యక్తి వైసీపీ నేతల అనుచరుడేనని పోలీసులు గుర్తించారని అన్నారు. ఈ ఘటన వెనుక వైసీపీ కుట్ర ఉందని ఆరోపించారు. ఎన్నిసార్లు బహిర్గతమైనా వైసీపీ నాయకత్వం తమ రాజకీయ విధానాన్ని మార్చుకోవడం లేదని విమర్శించారు. అంతేకాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ అనుసరిస్తున్న విధానాలను 'క్రిమినల్ పాలిటిక్స్'గా అభివర్ణిస్తూ, ప్రజలు వాస్తవాలను గమనించాలని లోకేశ్ పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy