Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయవాడలో  'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

మరావతి, మే 31, (ఆంధ్రజ్యోతి): గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ (Global Star Ram Charan) నటిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ( Peddi Movie) విజయవాడ వేదిక కానుంది.

ఈ చిత్రం విడుదలకు ముందు భారీ స్థాయిలో అభిమానులను ఆకట్టుకునేలా ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్రబృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు(సోమవారం) సాయంత్రం 5 గంటల నుంచి 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకలో హీరో రామ్ చరణ్‌తో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొననుంది. హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్‌ సందడి చేయనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.

ఇప్పటికే విజయవాడ నగరంలో మెగా అభిమానుల సందడి కనిపిస్తోంది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానుల కోసం ప్రత్యేక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన 'పెద్ది' సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందు నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ సినిమా ప్రమోషన్లలో కీలక ఘట్టంగా మారనుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హాజరుకానుండటంతో పాటు పవన్ కల్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమంపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy