Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిప్పులు చెరిగిన స్టార్క్.. 64 పరుగులకే బంగ్లా ఆలౌట్

నిప్పులు చెరిగిన స్టార్క్.. 64 పరుగులకే బంగ్లా ఆలౌట్

స్పోర్ట్స్ డెస్క్: మాకే వేదికగా రెండో టెస్టులో బంగ్లాదేశ్‌కు ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాకిచ్చింది. తొలి టెస్టులో ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగా ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ విజృంభించాడు.

అతడి దెబ్బకు బంగ్లాదేశ్ 64 పరుగులకే కుప్పకూలింది. స్టార్క్‌, కమిన్స్ బంతితో నిప్పులు చెరగడంతో బంగ్లా బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. షోరిఫుల్ ఇస్లామ్ 14 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలానే నలుగురు బంగ్లా బ్యాటర్లు ఖాతా తెరవకుండానే వెనుదిరగడం గమనార్హం. మరో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్‌లో తొలి బంతికే వికెట్ తీసిన మిచెల్ స్టార్క్.. నాలుగో ఓవర్ పూర్తయ్యేలోపు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. మొత్తంగా కేవలం 12 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తోడు కమిన్స్ సైతం విజృంభించి మూడు వికెట్లు పడగొట్టాడు. హాజిల్‌వుడ్ ఒక వికెట్ సాధించాడు. ఆరు వికెట్లు తీసిన స్టార్క్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టాప్-10లోకి ప్రవేశించాడు.

స్టార్క్107 టెస్టుల్లో 441 వికెట్లు పడగొట్టాడు. జాబితాలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం మురళీధరన్ (800 వికెట్లు) తొలి స్థానంలో, ఆసీస్ స్టార్ ప్లేయర్ షేన్ వార్న్ (708 వికెట్లు), ఇంగ్లండ్ స్టార్ జేమ్స్ అండర్సన్ (704 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. టాప్‌-10లో ఉన్న బౌలర్లలో నాథన్ లియోన్ (568 వికెట్లు) , స్టార్క్ మాత్రమే ప్రస్తుతం ఆటల్లో కొనసాగుతున్నారు.

strong>

పోర్చుగల్ తరఫున సెంచరీ బాదిన ఆసీస్ మాజీ క్రికెటర్!

చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy