హైదరాబాద్, జూన్7 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెడదామో చెప్పాలని సవాల్ విసిరారు.
ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని హెచ్చరించారు. పొలిమేరకు రాకుండా తనను అపేటోడు ఇంకా తెలంగాణలో పుట్టలేదని చెప్పుకొచ్చారు. ఈరోజు (ఆదివారం) హైదరాబాద్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తాను రేవంత్‌రెడ్డిలాగా పది పార్టీలు మారలేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తన పుట్టుక, చావు రెండు బీజేపీలోనే ఉంటాయని తెలిపారు. తానెంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డి ఎంత రెచ్చగొట్టిన తాను తొందరపడనని అన్నారు. అన్నింటికి సమయమే సమాధానం చెబుతోందని పేర్కొన్నారు. ఆయన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుగా అమలు చేసి తర్వాత తన గురించి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. దళితులు, బీసీలు రేవంత్‌రెడ్డి ఇంటికి వచ్చి ధర్నాలు చేస్తారని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
.
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News

