Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్

న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్

ఢిల్లీ, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈరోజు (మంగళవారం) రాజ్‌ఘాట్‌ను సందర్శించారు.

మహాత్మా గాంధీ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్.. గాంధీ స్మారకాన్ని సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పార్టీ శ్రేణులతో కలిసి రాజ్‌ఘాట్‌లో పర్యటన

ఈ కార్యక్రమంలో కేజ్రీవాల్, సిసోడియాలతో పాటు ఢిల్లీ మాజీ సీఎం అతిశీ మర్లెనా, ఆప్ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మహాత్ముడి అడుగుజాడల్లో నడుస్తూ అవినీతిపై పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు ప్రతిజ్ఞ చేశారు.

న్యాయవ్యవస్థపై గౌరవం.. రాజకీయాలపై స్పష్టత

రాజ్‌ఘాట్ సందర్శన అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ పోరాటం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం స్కాం కేసు కోర్టుకు సంబంధించిన విషయమని.. తాము భారత న్యాయ వ్యవస్థను, కోర్టులను పూర్తిస్థాయిలో గౌరవిస్తామని స్పష్టం చేశారు. తమపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఈకేసులో న్యాయవ్యవస్థ తమను నిర్దోషులుగా గుర్తించిందని, అందుకే బెయిల్ మంజూరు చేసిందని కేజ్రీవాల్ గుర్తు చేశారు. తమ నిజాయతీకి ఇదే నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తలెత్తిన కొన్ని అసాధారణ పరిస్థితుల కారణంగా తాను సత్యాగ్రహం చేయాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజల ముందుకు వెళ్తానని ఆయన సంచలన ప్రకటన చేశారు. మరో సత్యగ్రహం తప్పదని.. మోదీ ప్రభుత్వానికి కేజ్రీవాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy