అమరావతి, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఆగకూడదని అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (AP Minister Mandipalli Rama Prasad Reddy) ఆదేశించారు.
రవాణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రవాణా సంస్థలు తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ, ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సులు, ఇతర రవాణా సేవలు నిరంతరంగా కొనసాగించాలని వ్యాఖ్యానించారు. రవాణా సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఆందోళన చెందకుండా తమకు సహకరించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు.
.
వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.. మంత్రి నారాయణ ధ్వజం
అనంతపురంలో అమానుషం.. ఆరేళ్ల చిన్నారిపై వైసీపీ నేత అఘాయిత్యం
సీఎం చంద్రబాబుకు అవార్డు.. పవన్ కల్యాణ్ అభినందనలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News

