Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
న్యూడ్‌ వీడియోలతో బ్లాక్‌ మెయిలింగ్‌!

న్యూడ్‌ వీడియోలతో బ్లాక్‌ మెయిలింగ్‌!

  • నూజివీడులో రాజమండ్రి తరహా ఘటన!

  • అవమానంతో యువతి సహా కుటుంబం ఆత్మహత్యాయత్నం

  • ఆన్‌లైన్‌లో యువతికి పరిచయమైన షోలాపూర్‌ రోహన్‌

  • న్యూడ్‌ వీడియోలు తీసి డబ్బు కోసం కుటుంబానికి షేర్‌

  • 24 గంటల్లోనే అదుపులోకి.. నిందితుడికి రిమాండ్‌

నూజివీడు టౌన్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఇటీవల రాజమండ్రిలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన ఘటన తరహాలోనే ఏలూరు జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది. ఓ యువతిని నమ్మించి న్యూడ్‌ వీడియోల ద్వారా బెదిరింపులకు దిగిన యువకుడిని పోలీసులు 24 గంటలు తిరగకుండానే అరెస్టు చేసి ఆ కుటుంబాన్ని కాపాడారు. నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ శనివారం కేసు వివరాలు తెలిపారు. నూజివీడుకు చెందిన ఓ యువతికి ఆన్‌లైన్‌.. లూడో కం ఫన్‌ గేమ్‌లో మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన రోహన్‌ వైకుంఠం వేముల అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మరింతగా పరిచయం పెంచుకుని యువతితో న్యూడ్‌ వీడియోలను షేర్‌ చేసుకున్నాడు. సమయం చూసి యువతిని డబ్బు కోసం వేధించడమే కాక డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలను షేర్‌ చేస్తానని బెదిరించసాగాడు. చివరకు ఆమె తండ్రి పుట్టిన రోజునే (ఈనెల 26న) ఆ వీడియోలను ఆయనకు, బంధుమిత్రులకు షేర్‌ చేశాడు.

అవమానంగా భావించిన ఆ యువతితో పాటు ఆమె తల్లి, తండ్రి విషం తాగి ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. సరిగ్గా అదే సమయంలో ఆ యువతికి స్నేహితురాలు ఫోన్‌ చేయగా.. ఆమెతో ఈ విషయం చెప్పి బాధపడింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. అప్రమత్తమైన నూజివీడు రూరల్‌ సీఐ నాగేంద్రకుమార్‌ సిబ్బందిని పంపించి బాధితులను స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చి ధైర్యం చెప్పారు. ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. నూజివీడు పట్టణ ఎస్‌ఐ లక్ష్మణ్‌బాబు నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆగమేఘాలపై షోలాపూర్‌కు వెళ్లింది. కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే ఈనెల 27వ తేదీన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం నూజివీడు కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్‌ విధించింది.


సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్‌

గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy