Dailyhunt
పాక్ మధ్యవర్తిత్వం అక్కర్లేదు.. తిరస్కరించిన ఇరాన్..

పాక్ మధ్యవర్తిత్వం అక్కర్లేదు.. తిరస్కరించిన ఇరాన్..

శ్చిమాసియాలో ఘర్షణలను తగ్గించేందుకు ముందుకొచ్చిన పాకిస్థాన్‌కు ఇరాన్ షాకిచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్థాన్ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే పాక్ ప్రయత్నాలను ఇరాన్ తిరస్కరించింది. అందులో తమ ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు (Iran Pakistan mediation).

'దౌత్యం విషయంలో అమెరికా తరచుగా మాటలు మారుస్తోంది. అమెరికాతో ప్రత్యక్ష చర్చలు ఏమీ లేవు. అవన్నీ మధ్యవర్తుల ద్వారా బయటకు వచ్చిన డిమాండ్లు మాత్రమే. మధ్యవర్తిత్వం వహించాలనుకోవడం పాక్ స్వంత నిర్ణయం మాత్రమే. అందులో మా ప్రమేయం ఏమీ లేదు. యుద్ధం ముగింపు కోసం ఇస్తున్న పిలుపు సమంజసమైనదే. కానీ, దానిని ప్రారంభించినది ఎవరో గుర్తుంచుకోండి' అని కాన్సులేట్ జనరల్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు (Iran rejects Pakistan role).

ఆదివారం ఇస్లామాబాద్‌లో ఈజిప్ట్‌, సౌదీ, తుర్కియే మంత్రులతో పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ భేటీ అయ్యారు (Pakistan diplomacy). ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలపై పడుతున్న ఆర్థిక ప్రభావం గురించి చర్చించారు. త్వరలోనే ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా, ఇరాన్‌ మధ్య చర్చలు జరగనున్నాయని వెల్లడించారు. దౌత్య ప్రయత్నాల అంశంలో పాకిస్థాన్‌పై అమెరికా, ఇరాన్‌ విశ్వాసం ఉంచడంపై ఇషాక్‌ దార్‌ సంతోషం వ్యక్తం చేశారు.


పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy