Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్థాన్ క్రికెటర్‌ను హత్తుకున్న జెమీమా రోడ్రిగ్స్.. వీడియో వైరల్

పాకిస్థాన్ క్రికెటర్‌ను హత్తుకున్న జెమీమా రోడ్రిగ్స్.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌.. పాకిస్థాన్ క్రికెటర్‌ ఫాతిమా సనాను హత్తుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ది హండ్రెడ్ లీగ్ టోర్నీలో భాగంగా సదర్న్ బ్రేవ్, బర్మింగ్‌హామ్ ఫినిక్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ప్లేయర్లు పరస్పరం అభినందించుకుంటుండగా, జెమీమా- ఫాతిమా ఒకరినొకరు పలకరించుకుని ఆలింగనం చేసుకున్నారు.

2025లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఆసియా గేమ్స్ నాటి నుంచి ఇరు జట్ల ప్లేయర్లు షేక్‌హ్యాండ్ కూడా ఇచ్చుకోవడం మానేశారు. ఈ క్రమంలో ఫాతిమా సనాను జెమీమా హగ్ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన సదర్న్ బ్రేవ్.. 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. లిజెల్ లీ (43), మాయా బూషియర్ (45) రాణించగా, జెమీమా రోడ్రిగ్స్ 18 బంతుల్లో 28 పరుగులతో అజేయంగా నిలిచింది. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ తరఫున ఫాతిమా సనా మూడు సెట్ల (15 బంతులు) బౌలింగ్‌లో 33 పరుగులు ఇచ్చింది. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌కు టామీ బీమాంట్ (22), డవీనా పెరిన్ (52) శుభారంభం అందించినా, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్లకు 116 పరుగులకే పరిమితమైంది. దీంతో సదర్న్ బ్రేవ్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేయగా, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు.

strong>

జెర్పీ రంగు మార్పు వివాదం.. దిలీప్ టిర్కీ లేఖకు హాకీ ఇండియా వివరణ

కామన్వెల్త్ గేమ్స్: నీరజ్ చోప్రాకు రజతం.. యశ్వీర్‌కు కాంస్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy