Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాంటింగ్ రికార్డును బ్రేక్ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్..

పాంటింగ్ రికార్డును బ్రేక్ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్..

స్పోర్ట్స్ డెస్క్: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ఆల్ టైమ్ రికార్డును రూట్ అధిగమించాడు.

స్వదేశంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా పాంటింగ్ (7,578 పరుగులు) ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా ఆ రికార్డును జో రూట్ (7,594) బ్రేక్ చేశాడు. లార్ట్స్ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఫీట్ సాధించాడు.

స్వదేశంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు జాబితాలో భారత్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 7,216 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, మహేలా జయవర్ధనే, జాక్వెస్ కల్లిస్తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. మరోవైపు జో రూట్ విషయానికి వస్తే.. అతడు ఫామ్‌లో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్‌తో జరుగుతున్న ఈ సిరీస్‌లో బలహీనమైన బౌలింగ్ దాడిని ఎదుర్కొంటున్న రూట్, మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 94 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న జో రూట్ నుంచి మరింత మెరుగైన ప్రదర్శనను అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక లార్డ్స్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మ్యాచ్ రెండో రోజు ఇంగ్లండ్ పేసర్లు విజృంభించడంతో పాకిస్థాన్ జట్టు కేవలం 101 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అజాన్ అవైస్ (46) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. పునరాగమనం చేసిన బాబర్ ఆజమ్ (8) తీవ్రంగా నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆలీ రాబిన్సన్ 4 వికెట్లు పడగొట్టగా, జోఫ్రా ఆర్చర్ 3, జోష్ టంగ్ 2 వికెట్లతో చెలరేగారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కూడా ప్రారంభంలో తడబడింది. 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. స్వల్ప స్కోరు వద్దే వెనుదిరిగినప్పటికీ, జో రూట్ (24 పరుగులు) ఈ ఇన్నింగ్స్‌లోనే పాంటింగ్ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. ప్రస్తుతం ఓపెనర్ ఎమిలియో గెయ్ (30 నాటౌట్), హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 261 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది.

strong>

బీసీసీఐ ప్లాన్ అదేనా.. కౌంటీ క్రికెట్‌లో ఆకిబ్ నబీకి ఛాన్స్!

ఆసియా క్రీడలు: 'బి' టీమ్‌తో బరిలోకి భారత్.. ఆ పుకార్లకు బీసీసీఐ చెక్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy