Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..

పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..

తేడాది భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతిస్పందనగా తాము 'బునియాన్ ఉల్ మర్సూస్' ఆపరేషన్ చేపట్టామని పాకిస్థాన్ సైనికాధికారి ఒకరు పేర్కొన్నారు.

భారత్‌లోని 'రాజౌరి ఎయిర్‌బేస్', 'మామున్ ఎయిర్‌బేస్'లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఆయన ప్రకటించారు. అయితే అసలు ఆ పేర్లతో భారత వైమానిక దళానికి ఎలాంటి ఎయిర్‌బేస్‌లు లేకపోవడం గమనార్హం (Pakistan missile strike claim).

రాజౌరి అనేది జమ్మూ కశ్మీర్‌లోని ఒక జిల్లా. అక్కడ భారత వైమానిక దళానికి ఎలాంటి యాక్టివ్ ఎయిర్‌బేస్ లేదు (Rajouri airbase fake). అలాగే మామున్ అనేది పంజాబ్‌లోని పఠాన్‌కోట్ సమీప సైనిక కంటోన్మెంట్ ప్రాంతం. అక్కడ కూడా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు ఎయిర్‌బేస్ లేదు. ఆ విషయం తెలుసుకోకుండా పాక్ అధికారి అబద్ధాలు చెప్పడం సోషల్ మీడియాలో విమర్శలకు తావిస్తోంది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌లోని రాజౌరీ, మమూన్ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని సదరు పాక్ అధికారి తెలిపారు (Mamun airbase fake). దాంతో తాము ఫతా-1 క్షిపణులతో ఆ రెండు ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశామని పేర్కొన్నారు. అయితే భారత్‌లో అలాంటి ఎయిర్‌బేస్‌లే లేకపోవడంతో ఆ పాక్ అధికారిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy