Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పదంతస్తుల భవనంపై నుంచి దూకిన నవ వధువు.. చెట్టు కొమ్మల్లో చిక్కుకుని...

పదంతస్తుల భవనంపై నుంచి దూకిన నవ వధువు.. చెట్టు కొమ్మల్లో చిక్కుకుని...

ఇంటర్నెట్ డెస్క్: నేటికాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక , చదువు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల వంటి వివిధ కారణాలతో జీవితాలను ముగిస్తున్నారు.

ఇంకా దారుణం ఏమిటంటే... కొందరు నవ వధువులు కూడా ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా పెళ్లైన నాలుగు నెలలకే ఓ నవ వధువు ఆత్మహత్యకు యత్నించి.. చెట్టు కొమ్మల్లో చిక్కుకుని నరకయాతన అనుభవించింది. ఈ ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...

ముంబై నగరంలోని భాండూప్ అనే ప్రాంతంలో ప్రతీక్ష హివ్రాలే(26) అనే మహిళకు నాలుగు నెలల క్రితం వివాహం అయింది. నిన్న(బుధవారం) 10 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో భవనం కింద ఉన్న చెట్టుపై పడి.. కొమ్మల్లో చిక్కుకుంది. ఆ మహిళ చాలా సమయం పాటు ఆ కొమ్మల్లో చిక్కుకుని 25 అడుగుల ఎత్తులో వేలాడుతూ నరకయాతన అనుభవించింది.

స్థానికులు ఇచ్చిన సమాచారంలో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. కొమ్మల మధ్యలో ఉండిపోయిన యువతిని బయటకు తీసి రక్షించారు. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె స్పృహలో లేకపోవడం ఆత్మహత్యయత్నానికి గల కారణాలు ఏంటో తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళ స్పహలోకి వచ్చాక ఆమె నుంచి వాగ్మూలం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

strong>

ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy