Dailyhunt
పైలట్ అప్రమత్తత.. నిలిచిన ప్రయాణికుల ప్రాణాలు

పైలట్ అప్రమత్తత.. నిలిచిన ప్రయాణికుల ప్రాణాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని లేహ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.

దీంతో విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి న్యూఢిల్లీ ఎయిర్‌ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. మంగళవారం ఉదయం న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. వెంటనే ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులతో సంప్రదించారు. ఆ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ఈ సమయంలో విమానంలో దాదాపు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజన్‌లో వైఫల్యం కారణంగా ఈ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు ఎయిర్ పోర్టు ఉన్నతాధిాకారులు వెల్లడించారు. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పిందంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy