Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంత్‌పై వేటు

పంత్‌పై వేటు

న్డేల్లో చోటు గల్లంతు జూటెస్టు వైస్‌ కెప్టెన్సీ కూడా..

బుమ్రాకు విశ్రాంతి

ప్రిన్స్‌, మానవ్‌, గుర్నూర్‌, హర్ష్‌లకు చాన్స్‌

అఫ్ఘాన్‌తో సిరీస్‌లకు భారత జట్ల ఎంపిక

గువాహటి: పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌పై వేటు పడింది. అఫ్ఘానిస్థాన్‌తో జరగబోయే ఏకైక టెస్టు, మూడు వన్డేల కోసం మంగళవారం జాతీయ సెలెక్షన్‌ కమిటీ భారత జట్లను ప్రకటించింది. శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలో వచ్చే నెల 6 నుంచి ముల్లన్‌పూర్‌లో టెస్టు, 14 నుంచి ధర్మశాల, లఖ్‌నవూ, చెన్నైలలో వన్డేలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా పంత్‌ను టెస్టు వైస్‌కెప్టెన్సీ నుంచి తొలగించగా, వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. అతను చివరిసారిగా 2024లో చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో ఉన్నా బరిలోకి దిగే చాన్స్‌ రాలేదు. ఇక పని ఒత్తిడిలో భాగంగా స్టార్‌ పేసర్‌ బుమ్రాకు టెస్టు, వన్డేలకు విశ్రాంతినిచ్చారు. అ యితే ఇంగ్లండ్‌ పర్యటనకు అందుబాటులో ఉంటాడని చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తెలిపాడు. టెస్టు జట్టులో ఎడమచేతివాటం స్పిన్నర్లు మానవ్‌ సుతార్‌, హర్ష్‌ దూబేలతో పాటు పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌లకు తొలిసారి అవకాశం దక్కింది. వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమితో పాటు కశ్మీర్‌ పేసర్‌ అకీబ్‌ నబీలను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.

ఇషాన్‌కు పిలుపు: చాలా రోజుల తర్వాత భారత్‌ తరఫున టీ20ల్లో ఆడిన వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ను వన్డేలకు కూడా ఎంపిక చేశారు. రెండో కీపర్‌గా వ్యవహరించనున్న ఇషాన్‌ 2023లో ఆఖరి వన్డే ఆడాడు. ఇక ఈ ఫార్మాట్‌లో పేసర్‌ ప్రిన్స్‌ యాదవ్‌తో పాటు గుర్నూర్‌ బ్రార్‌, హర్ష్‌ దూబేలకు కూడా తొలిసారి అవకాశం దక్కింది. మరోవైపు వెటరన్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యాలను ఎంపిక చేసినప్పటికీ.. వారు తమ ఫిట్‌నె్‌సను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే సిరా జ్‌కు వన్డేల నుంచి విశ్రాంతినివ్వగా.. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లకు రెండు జట్లలోనూ చోటు దక్కలేదు.

టెస్టు జట్టు: శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ (వైస్‌కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, పంత్‌, దేవ్‌ దత్‌ పడి క్కళ్‌, నితీశ్‌ కుమార్‌, సుందర్‌, కుల్దీప్‌, సిరాజ్‌, ప్రసిద్ధ్‌, మానవ్‌ సుతార్‌, గుర్నూర్‌ బ్రార్‌, హర్ష్‌ దూబే, ధ్రువ్‌ జురెల్‌.

వన్డే జట్టు: గిల్‌ (కెప్టెన్‌), శ్రేయాస్‌ (వైస్‌కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కోహ్లీ, రాహు ల్‌, ఇషాన్‌, హార్దిక్‌, నితీశ్‌ కుమార్‌, సుం దర్‌, హర్ష్‌ దూబే, కుల్దీప్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌, ప్రిన్స్‌ యాదవ్‌, గుర్నూర్‌ బ్రార్‌.

ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..

బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy