నెల్లూరు, నవంబర్ 08: రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల్లో కూటమికి ప్రజలు పట్టం కట్టారని టీడీపీ ఎమ్మెల్యే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
ఈ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే రాష్ట్రంలో దీపావళి పండుగ వచ్చిందని అన్నారు. ఐదేళ్ల నిరంకుశ పాలన తర్వాత ఈ రెండున్నరేళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టారని చెప్పారు. ఆదివారం నెల్లూరు జిల్లా కోవూరులో ఆమె మాట్లాడుతూ.. ఈవీఎంలతో గెలిచాం అన్నారని.. బ్యాలెట్ పేపర్లతో అన్ని చోట్ల గెలిచామని వివరించారు. ప్రజల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వానికి ప్రజలు జేజేలు కొడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు.
కోవూరులో 5 జడ్పీటీసీల్లో 3 ఏకగ్రీవమయ్యామని గుర్తు చేశారు. కోవూరు ప్రజలు తమకు భారీ మెజార్టీతో బ్రహ్మరథం పట్టారని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే స్థానికంగా 78 ఎంపీటీసీలకుగాను 70 స్థానాల్లో తామే సత్తా చాటామని చెప్పారు. కూటమికి పట్టం కట్టిన ప్రజలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్కరు ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజయం సాధించిన కూటమి అభ్యర్థులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల్లో అరాచకాలు, రిగ్గింగ్‌కి మారుపేరు జగన్: మాజీ ఎమ్మెల్యే వర్మ

