Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెంచ్ టైగర్ రిజర్వ్‌లో అరుదైన దృశ్యం.. చిరుతని వెంటాడిన పులి.. వీడియో వైరల్

పెంచ్ టైగర్ రిజర్వ్‌లో అరుదైన దృశ్యం.. చిరుతని వెంటాడిన పులి.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పెంచ్ టైగర్ రిజర్వ్ (Pench Tiger Reserve) పార్క్‌లో చిరుత, పెద్ద పులి పోరాటానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అడవిలో సఫారీ చేస్తున్న పర్యాటకుల కళ్లెదుటే ఒక పులి.. చిరుతని అత్యంత వేగంగా తరుముతూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పులి దాడి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ చిరుతపులి క్షణాల వ్యవధిలో చెట్టుపైకి ఎక్కి తప్పించుకుంది. ఈ అద్భుత దృశ్యాన్ని పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు.

సాధారణంగా భారతీయ అడవుల్లో పులులు, చిరుతపులులు ఒకే ప్రాంతంలో సహజీవనం సాగిస్తున్నప్పటికీ.. వాటి మధ్య ఇలాంటి ప్రత్యక్ష ఘర్షణలు జరగడం, అవి కెమెరాకు చిక్కడం చాలా అరుదు. పులులు తమ సరిహద్దుల (Territory) విషయంలో అత్యంత కఠినంగా ఉంటాయని, తమ సామ్రాజ్యంలోకి ఇతర పెద్ద జంతువుల చొరబాటును అస్సలు సహించవనే దానికి ఈ ఘటనే నిదర్శనం. పెంచ్ అడవుల్లో లైవ్‌లో పులి-చిరుతల మధ్య జరిగిన ఈ పోరాటం వన్యప్రాణి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy