Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్టుబడుల హబ్‌గా ఏపీ..  మంత్రి నారా లోకేశ్ కృషితో మరో భారీ పరిశ్రమ

పెట్టుబడుల హబ్‌గా ఏపీ.. మంత్రి నారా లోకేశ్ కృషితో మరో భారీ పరిశ్రమ

అమరావతి, మే5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పెట్టుబడిదారులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుతోంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కృషితో రాష్ట్రానికి పరిశ్రమలు వరుసగా వస్తున్నాయి. గత 22 నెలల కాలంలో సుమారు 800 ప్రాజెక్టులు రాష్ట్రంలోకి వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో మరో అంతర్జాతీయ స్థాయి సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

శ్రీ సిటీలో క్యారియర్ సంస్థ భారీ పెట్టుబడి..

అమెరికాకు చెందిన ప్రముఖ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ (Carrier Global Corporation) ఆంధ్రప్రదేశ్‌లో తన కొత్త తయారీ యూనిట్‌ను ప్రారంభించనుంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ (Sri City) పారిశ్రామిక వాడలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమకు శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేశ్ రేపు(బుధవారం) నిర్వహించనున్నారు.

రూ.1000 కోట్ల పెట్టుబడి.. 3000 ఉద్యోగాలు..

ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన నూతన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. 2028 నాటికి మూడు దశల్లో సుమారు రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 3వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.

అత్యాధునిక HVAC తయారీ యూనిట్

క్యారియర్ సంస్థ ఈ ప్లాంట్‌ను అత్యాధునిక సాంకేతికతతో రూపొందించనుంది. ముఖ్యంగా HVAC (Heating, Ventilation, Air Conditioning) ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టనుంది. ఈ ప్లాంట్ హెచ్ వీ ఏసీ(HVAC), సంబంధిత ఉత్పత్తులపై పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే కాకుండా.. కార్యకలాపాల సామర్థ్యాన్ని, విస్తృతిని పెంచనుంది. ఈ యూనిట్ అత్యాధునిక మౌలిక వసతులు, ఆధునిక ప్లాంట్, మెషినరీ (P&M)తో ఏర్పాటుకానుంది. తద్వారా భవిష్యత్‌కు సిద్ధమైన తయారీ సామర్థ్యాలు, సాంకేతిక సమన్వయం, పోటీ సామర్థ్యం కలిగిన వాతావరణం ఏర్పడుతుంది.

.

మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

మోదీ దార్శనికతపై ప్రజల విశ్వాసం పెరుగుతోంది: సీఎం చంద్రబాబు

ఐదు రాష్ట్రాల ఫలితాల వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్.. నైపుణ్యం, కృషి, కరుణపై సందేశం

Read Latest AP News And Telangana News And International News And Telugu New

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy