Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

నెల్లూరు, మే 4 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది నిర్వహించే మహానాడును ఈ సారి నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ (AP Minister Narayana) వ్యాఖ్యానించారు.

మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహానాడును ఇఫ్కోసెజ్‌లో నిర్వహించాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు.

అక్కడ రెండు వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నామని.. ఈ నెల 6వ తేదీన పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రం, ప్రజల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలను మహానాడులో తీసుకుంటామని.. ప్రజలకు పలు హామీలు ఇస్తామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది మహానాడుకు రానున్నారని చెప్పుకొచ్చారు. ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy