Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీఆర్పీ..  విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన

పీఆర్పీ.. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన

విజయవాడ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. పరివర్తన రాజనీతి పార్టీ (PRP)పేరుతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) కొత్త పార్టీని ప్రకటించారు.

పార్టీ జెండా మధ్యలో ధర్మచక్రం గుర్తు, తెలుపు, కాషాయ రంగులో ఉండేలా పార్టీ జెండాను ఆయన రూపొందించారు.

దేవతల సాక్షిగా రాజకీయ పార్టీని ప్రారంభించా..

ఈ సందర్భంగా పరివర్తన రాజనీతి పార్టీ అధినేత విజయసాయి రెడ్డి ప్రసంగించారు. దేవతల సాక్షిగా రాజకీయ పార్టీని ప్రారంభించానని స్పష్టం చేశారు. మార్పు అన్నది ప్రజలే తీసుకురావాలని ఆకాంక్షించారు. ఏపీ భవిష్యత్తు ఏ నాయకుడు చేతుల్లో లేదని.. ప్రజల చేతుల్లో ఉందని వ్యాఖ్యానించారు. అధికార, ప్రతిపక్షాలు రెండు తప్పు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. నిజం, లెక్క, ప్రజల అవసరాలు అధికార, ప్రతిపక్షాలకి కనబడటం లేదని తెలిపారు. తప్పు ఎవరు చేసిన ప్రశ్నించాల్సిందేనని అన్నారు. ప్రశ్నించడం ప్రజల హక్కు అని చెప్పారు. పీఆర్పీ అంటే మీలోని నాయకత్వ లక్షణాలను పైకి తీసుకురావడమే తమ పార్టీ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలను రెండు కుటుంబాలే శాసిస్తున్నాయని తెలిపారు.

ఆ రెండు కుటుంబాలే శాసించాలా..

ఆ రెండు కుటుంబాలే శాసించాలా.. ఆ కుటుంబాల ఆధిపత్యం వద్దని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు కుటుంబాల నుంచే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కావాలా అని ప్రశ్నించారు. తండ్రి సీఎం అయితే కుమారుడు సీఎం కావాలా అని అడిగారు. ప్రతి కులంలో నాయకులు ఉంటారు.. పుడతారని చెప్పుకొచ్చారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పి యువతనే సీఎంగా చేయాలనేది తమ పార్టీ లక్ష్యమని వ్యాఖ్యానించారు. తుఫాన్ వచ్చినప్పుడు ప్రశాంతత ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో రాజకీయ ప్రకంపనలు జరగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాలకుల అరాచక పాలనపై విస్ఫోటనం ఎలా ఉంటుందో భవిష్యత్తులో ప్రజలే చూస్తారని అన్నారు. దుష్ట పరిపాలనకు ఈ సందర్భంగా తాను సవాల్ విసురుతున్నానని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.

ఓటు వేయడంతోనే ప్రజల పాత్ర ముగిసిపోదు..

ఓటు వేయడంతోనే ప్రజల బాధ్యత ముగిసిపోదని, అక్కడి నుంచే ప్రజాస్వామ్యంలో వారి అసలైన పాత్ర ప్రారంభమవుతుందని విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అధికార, ప్రతిపక్షాల ఆత్మప్రశంసలు, రాజకీయ విమర్శల హోరులో నిజాలు, లెక్కలు, ప్రజల ప్రాథమిక అవసరాలు కనుమరుగవుతున్నాయని తెలిపారు. ఎవరు తప్పు చేసినా నిలదీసి ప్రశ్నించాలని అన్నారు. అది తానైనా, సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయినా ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు. 'పరివర్తన రాజనీతి పార్టీ' (PRP) ద్వారా మరొక నాయకుడిని ఇవ్వడానికి తాను రాలేదని, యువతలోని నాయకత్వ లక్షణాలను వెలికితీసి వారిని నాయకులుగా మార్చడానికే వచ్చానని తేల్చిచెప్పారు. ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల భవిష్యత్తును కేవలం రెండు కుటుంబాలే శాసిస్తున్నాయని చెప్పుకొచ్చారు. యువతలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి, సామర్థ్యం ఉన్న యువకుడినే ముఖ్యమంత్రిని చేయడమే తర ప్రధాన ఉద్దేశమని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో అహంకారపూరితమైన రెండు కుటుంబాల నాయకత్వానికి స్వస్తి పలకాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు.

వైసీపీ నిర్మాణంలో నేను క్రియాశీలకం గా పనిచేశా..

ప్రతి కులంలోనూ, ప్రతి సామాజిక వర్గంలోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం ఉన్న నాయకులు ఉన్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ రాజకీయంలో పాత పద్ధతులకు, దుష్ట పరిపాలనకు సవాల్ విసురుతూ కొత్త రాజకీయ సంస్కృతికి పునాది వేస్తున్నామని వెల్లడించారు. ఈ రాజకీయ ప్రయాణం తన ఒక్కడిది కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటమని వ్యాఖ్యానించారు. నాయకత్వ పదవులు వారసత్వంగా రాకూడదని అన్నారు. ప్రజల తీర్పు, సామర్థ్యాల ఆధారంగానే రావాలని అభిలాషించారు. రాబోయే రాజకీయ ప్రళయం ద్వారా బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే పరివర్తన రాజకీయాలు మొదలవుతాయని వివరించారు. వైసీపీ నిర్మాణంలో తాను క్రియాశీలకంగా పనిచేశానని ప్రస్తావించారు. ఇప్పుడు బయటకు వచ్చానని.. అక్కడి నుంచి వచ్చేవారికి ఈ పార్టీ తలపు ఎప్పుడూ తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీలో 175కు 175 సీట్లలో పీఆర్పీ పోటీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 26 కులాలను బీసీల నుంచి తొలగించారని. ఈ విషయం గురించి సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy