Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్

అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్

అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో అమరులైన వీరులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఘన నివాళలు అర్పించారు.

ఏపీ అటవీ సిబ్బందికి వందనమంటూ ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్టు పెట్టారు. ఈ రోజు మనం పరిరక్షిస్తున్న అడవులు, రేపటి తరాలకు మనం వదిలి వెళ్లే వారసత్వమని తెలిపారు. వాటిని కాపాడుతూ తమ ప్రాణాలను అర్పించిన వారు, కాలం ఎన్నటికీ చెరిపివేయలేని వారసత్వాన్ని భద్రపరిచారని పేర్కొన్నారు.

రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా, మన అడవులు, వన్యప్రాణులు సహజ వారసత్వాన్ని కాపాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన రాష్ట్ర అటవీ సిబ్బందికి ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. సవాలుతో కూడిన ప్రమాదకరమైన పరిస్థితుల్లో సేవలందిస్తున్న ప్రతి అటవీ అధికారికి, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి కూడా తాను వందనం చేస్తున్నానని అన్నారు. వారి భద్రత, సంక్షేమం, గౌరవం మనందరి సమష్టి ప్రాధాన్యంగా ఉండాలని పేర్కొన్నారు.

అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిదని పవన్ కల్యాణ్ కొనియాడారు. అడవులే మన వారసత్వం.. వాటి రక్షకులే నిజమైన వీరులని ప్రశంసించారు. అటవీ అధికారుల భద్రత, సంక్షేమానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. అటవీ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy