Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీవీ సింధుకు అరుదైన గౌరవం.. అభినందనలు తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పీవీ సింధుకు అరుదైన గౌరవం.. అభినందనలు తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

అమరావతి, నవంబర్10: భారత ఒలింపిక్ సంఘం (IOA) అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎంపిక కావడం పట్ల రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఆమెకు అరుదైన గౌరవం దక్కిందని అన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మంగళవారం రాజధాని అమరావతిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. అథ్లెట్స్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ ఎన్నిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఐఓఏ జనరల్ బాడీలో అథ్లెట్ ప్రతినిధులుగా మీరాబాయి చాను, సాజన్ ప్రకాష్ ఎంపిక కావడం భారత క్రీడారంగానికి గర్వకారణమని చెప్పారు.

అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన క్రీడాకారులకు కీలక బాధ్యతలు దక్కడం సంతోషంగా ఉందని అన్నారు. క్రీడాకారుల నాయకత్వంలో భారత క్రీడారంగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ఏపీలో క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

ప్రణబ్ ప్రధాని కావాలనుకున్నారు.. తన ఆత్మకథలో వెల్లడించిన సోనియా గాంధీ..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy