నెల్లూరు, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ (AP Minister Narayana) అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈరోజు(ఆదివారం) నెల్లూరులోని స్వతంత్ర పార్క్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వాకర్స్, కరాటే స్టూడెంట్స్‌తో కలిసి మంత్రి యోగాసనాలు ఆచరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో యోగా దినోత్సవం జరుపుకోవడం భారతీయులందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు.
భారతీయ సంస్కృతైన యోగాకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో యోగా వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం, తద్వారా రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యమని చెప్పకొచ్చారు. జగన్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన స్వతంత్ర పార్క్‌ను తాము అద్భుతంగా పునరుద్ధరించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
.
అమరావతిని చాలా బాగా అభివృద్ధి చేశారు.. సీఎం చంద్రబాబుపై బాబా రామ్‌దేవ్ ప్రశంసలు
నేను హోం మంత్రిని కాదు... అది క్రిమినల్స్ అదృష్టం: పవన్ కల్యాణ్
25 కోట్ల మందిని పేదరికం నుంచి మోదీ సర్కార్ బయటకు తీసుకొచ్చింది: మంత్రి సత్యకుమార్
Read Latest AP News And Telangana NewsAnd National News
And Telugu News

