Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతిని చాలా బాగా అభివృద్ధి చేశారు.. సీఎం చంద్రబాబుపై బాబా రామ్‌దేవ్ ప్రశంసలు

అమరావతిని చాలా బాగా అభివృద్ధి చేశారు.. సీఎం చంద్రబాబుపై బాబా రామ్‌దేవ్ ప్రశంసలు

విజయవాడ, జూన్ 20, (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై (CM Chandrababu Naidu) ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ (Baba Ramdev) ప్రశంసలు కురిపించారు.

సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడారు. సీఎంని కలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి దేవతల రాజధాని అని వ్యాఖ్యానించారు. అమరావతిని చాలా బాగా అభివృద్ధి చేశారని ప్రశంసల వర్షం కురిపించారు. ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ వీటన్నిటిని ఎంతగానో సీఎం అభివృద్ధి చేశారని కొనియాడారు. ఈరోజు (శనివారం) విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకుని బాబా రామ్‌దేవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

సనాతన ధర్మాన్ని కాపాడాలి..

దుర్గమ్మని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని బాబా రామ్‌దేవ్ తెలిపారు. జగన్మాత దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలమని చెప్పుకొచ్చారు. అమ్మని దర్శించుకోవడం తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని వివరించారు. మనమందరం సనాతన ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. అమ్మవారి ఆశీర్వచనాలు ప్రజలందరిపైన ఉండాలని కోరుకున్నానని అన్నారు. అమ్మవారు ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలిశారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అమ్మవారి శక్తి పీఠం ఉండటం ఎంతో అదృష్టమని బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు.

.

ఈగల్ వ్యవస్థతో డ్రగ్స్‌కు చెక్ పెట్టాం: హోం మంత్రి అనిత

మహిళలను కించపరిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు.. వైసీపీకి మంత్రి ఆనం వార్నింగ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy