Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజావాణి సేవల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ప్రజావాణి సేవల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజావాణి వ్యవస్థపై సీఎం ఈరోజు(ఆదివారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 2023 డిసెంబర్ 8వ తేదీన ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ప్రతి మంగళ, శుక్రవారం ప్రజా భవన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో కూడా వారానికి ఒకసారి నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజావాణి సేవల విస్తరణపై ఫోకస్ పెట్టామని అన్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో వెంటనే ప్రజావాణి ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. తదుపరి దశలో మండల స్థాయికి విస్తరిస్తున్నామని తెలిపారు.

ఫిర్యాదుల పరిష్కారంపై కఠిన ఆదేశాలు..

దూర ప్రాంతాల ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఫిర్యాదుల పరిష్కారంపై కఠిన ఆదేశాలు జారీ చేశామని అన్నారు. ప్రతి అర్జీ తప్పనిసరిగా నమోదు చేయాలని.. నిర్ణీత గడువులో పరిష్కారం చేయాలని సూచించారు. ఆలస్యం జరిగితే అధికారులదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఫిర్యాదుల కోసం ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. డ్యాష్‌బోర్డ్ ద్వారా పురోగతిని పర్యవేక్షిస్తామని చెప్పుకొచ్చారు. ప్రతి స్థాయిలో నోడల్ అధికారుల నియమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి జిల్లా, శాఖలో ప్రజావాణి విభాగాల ఏర్పాటు చేస్తామని అన్నారు.

అప్పీల్ వ్యవస్థ ప్రవేశపెట్టాలి..

ఒక స్థాయిలో పరిష్కారం కాకపోతే పైస్థాయికి ఆటో ఎస్కలేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అవసరమైతే అప్పీల్ వ్యవస్థ ప్రవేశపెట్టాలని అన్నారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వికేంద్రీకరణతో పెండింగ్ అర్జీలు తగ్గుతాయని స్పష్టం చేశారు.. కిందిస్థాయిలోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెంచడమే లక్ష్యంగా పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఫిక్స్.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..

ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వ కీలక నిర్ణయం.. చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణరావు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy