Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచవ్యాప్తంగా యూఎస్‌ వీసా అప్పాయింట్‌మెంట్స్‌ నిలిపివేత

ప్రపంచవ్యాప్తంగా యూఎస్‌ వీసా అప్పాయింట్‌మెంట్స్‌ నిలిపివేత

వాషింగ్టన్‌, ఆగస్టు 26: ప్రపంచవ్యాప్తంగా వీసా అప్పాయింట్‌మెంట్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వచ్చిన తరువాత ప్రభుత్వంపై ఆర్థికంగా ఆధారపడే అవకాశం ఉన్నవారిని(పబ్లిక్‌ చార్జ్‌) క్షుణ్ణంగా పరిశీలించి, నిరంతరాయంగా గుర్తించడంలో కాన్సులర్‌ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.

హెచ్‌-1బీ వీసాలకు 1,03,265 డాలర్లను ఫీజుగా ట్రంప్‌ పాలనాయంత్రాంగం ప్రతిపాదించిన ఒక రోజు తరువాత వీసా ఇంటర్వ్యూల నిలిపివేత నిర్ణయం వెలువడింది. ఈ మేరకు ఇప్పటికే వీసా దరఖాస్తుదారులందరికీ 'అప్పాయింట్‌మెంట్స్‌ రీ షెడ్యూల్‌ చేశారు. ''మీ అప్పాయింట్‌మెంట్‌ తేదీ, సమయాన్ని మరలా మీకు తెలియచేస్తాం' అంటూ దరఖాస్తుదారులకు మెయిల్స్‌ వెళ్లినట్లు సమాచారం.

ఈ వార్తలనూ చదవండి:

ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy