అమరావతి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ -2025' ప్రతిష్ఠాత్మక అవార్డు రావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
సీఎం చంద్రబాబును కొనియాడుతూ పవన్ కల్యాణ్ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. ప్రముఖ ఆర్థిక దినపత్రిక 'ది ఎకనామిక్ టైమ్స్' వారు సీఎంకు ఈ పురస్కారం అందజేయడంపై పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కృషి అనిర్వచనీయం..
వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంలో, పాలనలో వేగాన్ని పెంచడంలో చంద్రబాబుకు ఉన్న దూరదృష్టిని ఈ అవార్డు ప్రతిబింబిస్తోందని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు ఒక అగ్రగామి గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో సీఎం కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ మరింత గొప్ప వైభవం దిశగా పయనిస్తుందని, అభివృద్ధి రంగాల్లో ఆయన నాయకత్వం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పురస్కార ప్రాముఖ్యం..
ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో, పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయడంలో విశేష కృషిచేసిన నాయకులకు 'ది ఎకనామిక్ టైమ్స్' ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. 2025 సంవత్సరానికి గాను చంద్రబాబు ఎంపికవ్వడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కూటమి ప్రభుత్వానికి పెద్దఎత్తున ప్రోత్సాహాన్ని కల్పించింది. ముఖ్యమంత్రికి దక్కిన ఈ గౌరవంపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు అనుభవం, పవన్ కల్యాణ్ మద్దతు కలిసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయని కూటమి నేతలు అభిప్రాయపడ్డారు.
.
రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్.. మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
జగనన్న లే అవుట్‌లలో భారీగా అవినీతికి పాల్పడ్డారు: మంత్రి కొల్లు రవీంద్ర
రైతులకు గుడ్ న్యూస్.. ఆ నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
Read Latest AP News And Telangana News And International News And Telugu News

