Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్‌ బర్త్‌డే విషెస్‌..

ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్‌ బర్త్‌డే విషెస్‌..

స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెటర్‌ రింకూ సింగ్‌ తన కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్‌ పుట్టినరోజు వేళ ప్రత్యేక ప్రేమ సందేశం పంపాడు. ప్రియా 28వ బర్త్ డే సందర్భంగా సోషల్‌ మీడియాలో రింకూ పంచుకున్న సందేశం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

ప్రియ పుట్టినరోజు వేళ ఆమెతో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేసిన రింకూ.. 'మనకు బర్త్ డే ప్రత్యేకమైనది. అలానే రాబోయే రోజులు మరింత ప్రత్యేకం' అంటూ రాసుకొచ్చారు. త్వరలోనే వీరిద్దరూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మచ్లిషహర్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియా సరోజ్‌తో రింకూ నిశ్చితార్థం 2025 జూన్‌ 8న లఖ్‌నవూలో ఘనంగా జరిగింది. వాస్తవానికి గతేడాది నవంబరులోనే వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ క్రికెట్‌ షెడ్యూల్‌ కారణంగా వాయిదా పడింది. తాజాగా 2026న డిసెంబరు 4 లఖ్‌నవూలోని రమాడా హోటల్‌లో వీరి వివాహ వేడుకకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అనంతరం రింకూ స్వస్థలం అలీగఢ్‌లో రిసెప్షన్‌ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

ఇప్పటికే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేయగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ రింకూ సింగ్‌ ప్రస్తుతం ఆటపై దృష్టి సారించారు. ఖతార్‌ రాజధాని దోహాలో జరుగుతున్న ‘ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026’ టోర్నీలో భారత్‌-ఎ జట్టు తరఫున అతడు ఆడుతున్నాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

strong>

ఆకాశ్‌దీప్‌పై గిల్ అసహనం.. కెప్టెన్ తీరును తప్పుబట్టిన రహానె!

భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన యూఏఈ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy