Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాహుల్ గాంధీపై విమర్శలు.. ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్స్ పోస్టు వైరల్..

రాహుల్ గాంధీపై విమర్శలు.. ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్స్ పోస్టు వైరల్..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ పెట్టిన సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. అంధభక్తులంటూ కొంతమందిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్పితా చటర్జీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

అయితే, అర్పితా చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చ కంటే ఆమె ఇంగ్లిష్ వ్యాకరణంపై పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. ఆమె ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని ప్రశ్నిస్తూ పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎక్స్ పోస్టులో అర్పితా చటర్జీ తనను తాను పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పేర్కొన్నారు. తాను ఇంగ్లిష్, ఎడ్యుకేషన్‌లో రెండు మాస్టర్స్ డిగ్రీలతో పాటు బీఈడీ పూర్తి చేశానని చెప్పారు. అలాగే ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నానని వెల్లడించారు. ఇటీవల రాహుల్ గాంధీ అంధభక్తులంటూ చేసిన వ్యాఖ్యలపై అదే పోస్టులో ఆమె స్పందించారు. 'డియర్ రాహుల్ గాంధీ.. నేను గర్వపడే అంధభక్తురాలిని. మీ ప్రకారం అంధభక్తి అంటే ఇడియట్. మరి నేను ఇడియట్‌నా? మీకు కచ్చితంగా చెప్పగలరా?' అని ప్రశ్నించారు. అయితే, రాహుల్‌పై ఆమె విమర్శలు కంటే పోస్టులోని ఇంగ్లిష్ వాక్య నిర్మాణం, వ్యాకరణ దోషాలే నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. రెండు మాస్టర్స్ డిగ్రీలు, ముఖ్యంగా ఇంగ్లిష్‌లో పీజీ చేసిన వ్యక్తి పోస్టులో ఇలాంటి తప్పులు చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు.

అర్పితా చటర్జీ ఎక్స్ పోస్టులోని వ్యాకరణ లోపాలను కొంతమంది నెటిజన్లు ఒక్కొక్కటిగా ఎత్తిచూపగా, మరికొందరు వ్యంగ్యంగా స్పందించారు. 'రాజకీయ విమర్శ చేయాలని వచ్చి చివరికి గ్రామర్ క్లాస్ నిర్వహించినట్టైంది' అంటూ సెటైర్లు వేశారు. ఇంగ్లిష్‌లో పీజీ చేసిన వ్యక్తి నుంచి ఇలాంటి తప్పులు చేయడాన్ని ఊహించలేకపోతున్నామని ఇంకొందరు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అర్పితా చటర్జీ ఎక్స్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వార్తలు కూడా చదవండి

అయోధ్య విరాళాల చోరీపై విపక్షం వ్యంగ్య నాటకం!

రూ.84 వేల కోట్లతో సాగర మథనం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy