Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజకీయాలకు దూరంగా ఉంటాను: ప్రశాంత్ కిషోర్ భార్య

రాజకీయాలకు దూరంగా ఉంటాను: ప్రశాంత్ కిషోర్ భార్య

ఇంటర్‌నెట్ డెస్క్: జన్‌సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిషోర్‌ను భారీ మెజార్టీతో గెలిపించిన బాంకీపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆయన భార్య డాక్టర్ జాహ్నవీ దాస్ ధన్యవాదాలు తెలిపారు.

ప్రశాంత్ గెలుపులో తన ప్రమేయం లేదని, తాను రాజకీయాలకు చాలా దూరంగా ఉంటానని ఆమె చెప్పారు. తన భర్తకు రాజకీయపరంగా అద్భుతమైన సాయం అందించే చాలా మంచి టీమ్ ఉందని అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాహ్నవీ దాస్ మాట్లాడుతూ..

'మేము చాలా సంతోషంగా ఉన్నాము. కామాఖ్య దేవతకు, బాంకీపూర్ నియోజకవర్గ ప్రజలకు, బిహార్ ప్రజలకు, ఆయన టీమ్‌లోని ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు. నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాను. ఆయనకు చాలా మంచి టీమ్ అండగా ఉందని అనుకుంటున్నాను. కానీ, వ్యక్తిగత జీవితంలో నా వీలైనంత సాయం ఆయనకు ఎప్పుడూ ఉంటుంది. 2025లో ప్రశాంత్ చాలా కష్టపడి పని చేశారు. ఈ సారి కూడా అలాగే కష్టపడ్డారు. ఈ సారి ప్రజలు ఆయన కష్టాన్ని అంగీకరించారు' అని చెప్పుకొచ్చారు.

కాగా, బాంకీపూర్‌ అసెంబ్లీ స్థానంలో ప్రశాంత్‌ కిషోర్‌ భారీ విజయాన్ని నమోదు చేశారు. బీజేపీ అభ్యర్థి నీరజ్‌కుమార్‌పై 19,324 ఓట్ల మెజారిటీతో విజయబావుటా ఎగురవేశారు. ప్రశాంత్ కిషోర్‌కు 64,151 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి నీరజ్‌ కుమార్‌ సిన్హా 44,827 ఓట్లు సాధించారు.

>

పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్

ఆ ఒక్కసారే కేఎల్ రాహుల్‌ కోపంగా ఉండటం చూశా: వసీం జాఫర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy