Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సానుభూతి

రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సానుభూతి

నేపాల్‌లో ఆకస్మిక వరదలు, విపత్తుపై రాష్ట్రపది ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ముర్ము.. నేపాల్‌ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌కు కాల్‌ చేసి మాట్లాడారు.

ఈ క్లిష్ట సమయంలో నేపాల్‌కు భారత్‌ సంఘీభావంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సైతం నేపాల్‌ ప్రధాని బాలేంద్రషాకు ఫోన్‌కాల్‌ చేసి.. తీవ్ర సానుభూతి తెలిపారు. 'ఈ కష్ట సమయంలో నేపాల్‌లోని మా సోదరసోదరీమణులకు భారత ప్రజలు అండగా నిలుస్తారు''అని చెప్పారు. నేపాల్‌కు అవసరమైన అన్నిరకాల మానవతాసాయాన్ని అందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని తెలియజేశారు.

ప్రత్యేక హెల్ప్‌లైన్‌

నేపాల్‌లో మెరుపువదరల్లో చిక్కుకున్న భారతీయలకు సాయం అందించేందుకు ఖాట్మండులోని భారత ఎంబసీ అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబర్లను (+977 985 131 6807, +977 970 910 7500) ఏర్పాటు చేసింది. పర్యాటకులు అత్యవసర సాయం కోసం 1234, 1144, 9851289445 నంబర్లలో సంప్రదించొచ్చని నేపాలీ టూరిజం బోర్డు సూచించింది. అలాగే, చిక్కుకుపోయిన భారత పర్యాటకులు క్షేత్రస్థాయిలో చైనా అధికారులను 139 8999 0012 నంబర్‌లో సంప్రదించొచ్చని చైనాలోని భారత ఎంబసీ ప్రకటించింది. అలాగే బీజింగ్‌లోని భారత ఎంబసీని 0086 185 1428 4905 నంబర్‌లో సంప్రదించొచ్చని సూచించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం, నేపాల్‌ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు చర్యలు చేపడున్నట్టు ప్రకటించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy