Dailyhunt
రఘు వంశీ ఔట్‌పై దుమారం.. అంపైర్లపై కేకేఆర్ ప్లేయర్ల ఆగ్రహం!

రఘు వంశీ ఔట్‌పై దుమారం.. అంపైర్లపై కేకేఆర్ ప్లేయర్ల ఆగ్రహం!

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026లో ఏకానా స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘు వంశీ ఔటైన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్ రూల్ కింద అంగ్‌క్రిష్ రఘు వంశీ పెవిలియన్ చేరాడు. అయితే ఈ నిర్ణయంపై కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్, ఓనర్ వెంకీ మైసూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో ప్రిన్స్ యాదవ్ వేసిన 4.6 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని రఘువంశీ మిడాన్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసేందకు ప్రయత్నం చేశాడు. కానీ మరోఎండ్ లో ఉన్న కామెరూన్ గ్రీన్ నిరాకరించాడు. దాంతో సగం క్రీజు ధాటికి రఘువంశీ యూటర్న్ తీసుకొని వెనక్కివెళ్లిపోయాడు. ఇదే సమయంలో బంతిని అందుకున్న మహ్మద్ షమీ.. వికెట్ కీపర్‌గా ఉన్న రిషభ్ పంత్‌కు అందించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి కాస్త రఘువంశీకి తాకింది. అప్పటికీ అతను క్రీజుకు చేరుకోకపోవడంతో అబ్‌ స్ట్రాక్టింగ్ ఫీల్డ్ రూల్ ఔట్ కోసం పంత్ అప్పీల్ చేశాడు.

దీంతో థర్డ్ అంపైర్ పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించి రఘువంశీని ఔట్‌గా పేర్కొన్నాడు. ఇక అంపైర్ నిర్ణయం రఘువంశీ తో పాటు ఆ జట్టు హెడ్ కోశ్ అభిషేక్ నాయర్ అంసతృప్తి వ్యక్తం చేశారు. కాసేపు రఘువంశీ ఫీల్డ్ అంఫైర్‌తో కాసేపు వాగ్వాదం పెట్టుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా రఘువంశీ బంతికి అడ్డుపడకపోయినా అబ్‌స్ట్రక్టింగ్ ఫీల్డ్ రూల్ కింద ఎలా ఔటిస్తారని కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ సైతం ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు . అయితే రఘు వంశీ బంతి గమనాన్ని చూసే.. తన దిశ మార్చుకొని పరుగెత్తాడని భావించిన థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఔట్ అంటే మరికొందరు కాదంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy