Dailyhunt
రైతులకు గుడ్ న్యూస్.. ఆ నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

రైతులకు గుడ్ న్యూస్.. ఆ నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

మరావతి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఏపీ మంత్రి నారాయణ (AP Minister Narayana) శుభవార్త తెలిపారు.

ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు నిధులు జమ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌ను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కొనసాగుతున్న తీరుపై అధికారులతో మంత్రి నారాయణ ఈరోజు (శనివారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రవణ్ కుమార్, భాష్యం ప్రవీణ్, సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్లు భార్గవ తేజ, కార్తీక్, డిప్యూటీ కలెక్టర్లు, ఎమ్మార్వోలు హాజరయ్యారు.

ఇంటర్ నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వేలైన్, రైల్వేస్టేషన్ కోసం 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఎంజాయ్‌మెంట్ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, లెగసీ వేస్ట్, ఫ్రెష్ వేస్ట్ నిర్వహణ ఏజెన్సీలతో పలు కీలక అంశాలపై మంత్రి నారాయణ చర్చించారు. లెగసీ వ్యర్థాలను త్వరితగతిన పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. ఫ్రెష్‌వేస్ ప్లాంట్‌ల ఏర్పాటు త్వరగా పూర్తి చేసి వ్యర్థాల నిర్వహణ ప్రారంభించాలని సూచించారు. ప్లాంట్‌ల ఏర్పాటుకు స్థలం ఇబ్బందిగా ఉన్న చోట కలెక్టర్లతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ ఆదేశించారు.

.

ఏపీలో కిల్లర్ పార్టీ దారుణాలకు తెగబడుతోంది.. సీఎం వార్నింగ్

బీటెక్ విద్యార్థులను సైబర్ క్రైమ్‌లోకి ముఠాలు లాగుతున్నాయి: రాయపాటి శైలజ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy